Nandyal: రాయలసీమను అభివృద్ధి చేస్తున్నది చంద్రబాబు నాయుడే.. నంద్యాలలో నిరసన

Nandyal: రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ నేతల విమర్శలను తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం శ్రేణులు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 23 April 2026 2:57 PM IST
Nandyal
X

Nandyal: రాయలసీమను అభివృద్ధి చేస్తున్నది చంద్రబాబు నాయుడే.. నంద్యాలలో నిరసన

Nandyal: నిన్న నంద్యాలలో వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై సమావేశం నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై చేసిన విమర్శలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాయలసీమకు ప్రాజెక్టులు తీసుకొని వచ్చి రైతుల కష్టాలు తీర్చిన నిజమైన నాయకుడు గౌరవ చంద్రబాబు గారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్లక్ష్యం జరిగింది. అన్నమయ్య ప్రాజెక్ట్ నష్టం జరిగితే పట్టించుకోలేదు, టీబీ డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినప్పుడు కూడా తక్షణ చర్యలు తీసుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పందించి రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తి చేశారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ప్రజల కోసం పనిచేయడం తెలియని వైసీపీ నేతలు ప్రజల కోసం నిరంతరం కష్టపడే చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సరికాదు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు, ఇప్పటికైనా మీరు రాజకీయ విమర్శల పై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story