Nandyal: కొలిమిగుండ్ల విద్యుత్ శాఖ జేఈ లక్ష్మణస్వామి అదృశ్యం!
Nandyal: కొలిమిగుండ్ల విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ లక్ష్మణస్వామి అదృశ్యం. తిరుపతి వెళ్తున్నానని చెప్పి వెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్.. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు.
Nandyal: కొలిమిగుండ్ల విద్యుత్ శాఖ జేఈ లక్ష్మణస్వామి అదృశ్యం!
Nandyal: లక్ష్మణస్వామి స్వగ్రామం సత్యసాయి జిల్లా ధర్మవరం 14 సంవత్సరాల నుండి జేఈ గా కొలిమిగుండ్ల లో విధులు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి కొలిమిగుండ్ల లో నివాసం ఉంటున్నాడు. ఈనెల 8వ తేదీ రాత్రి కారు తీసుకుని ప్రమోషన్ ఉందని సంబంధిత పత్రాలు తిరుపతిలో సమర్పించాలని ఇంటి నుంచి బయలుదేరారు.
మరుసటి రోజు నుండి జేఈ లక్ష్మణస్వామి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కుటుంబ సభ్యులకు పలుసార్లు ఫోన్ చేసిన అందుబాటులోకి రాలేదు బంధువులు ఫోన్ చేసిన వాళ్ళ ఊళ్ళలో ఆరా తీసిన ఆచూకీ లభించకపోవడంతో చివరకు లక్ష్మణస్వామి భార్య లీలావతి కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మిస్సింగ్ కేసు నమోదు చేసిన కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు.
విద్యుత్ అధికారుల ఒత్తిడా లేక కుటుంబ సభ్యుల కలహాల పోలీసు విచారణలో తెలియవలసి ఉంది. కొలిమిగుండ్ల మండలంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యం కావడంపై తీవ్ర చర్చనీయాంశం మారింది.




