Markapuram: బేస్తవారిపేటలో ‘సుభోజనం’ సేవా కార్యక్రమం ప్రారంభం!
Markapuram: బేస్తవారిపేటలో 'సుభోజనం' కార్యక్రమం ప్రారంభం. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే ఉచిత క్యారేజీ భోజనం. ప్రారంభించిన కామూరి రమణారెడ్డి.
Markapuram: బేస్తవారిపేటలో ‘సుభోజనం’ సేవా కార్యక్రమం ప్రారంభం!
Markapuram: మార్కాపురం జిల్లాలో వృద్ధులకు, వికలాంగులకు ఇంటింటికి ఆహారాన్ని క్యారేజీ రూపంలో అందించే కార్యక్రమానికి సుభోజనం, మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ సేవా సంస్థలు శ్రీకరం చుట్టాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి, సూర్య శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ హాజరయ్యారు.
బేస్తవారిపేట మండలంలో నా అనేవాళ్ళు ఎవరూ లేక మంచానికే పరిమితమై ఆహారానికి అవస్థలు పడే వృద్ధులను వికలాంగులను గుర్తించి సుభోజనం, మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి స్వచ్ఛంద సేవ సంస్థలు 12 గ్రామాలలో 64 మందికి ఇంటికే ఆహారాన్ని క్యారేజీ రూపంలో రెండు పూటలా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కామూరి రమణారెడ్డి తెలిపారు.
మొదటి విడతగా బేస్తవారిపేట మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని జిల్లాలో మరింత విస్తరిస్తామని సంస్థ సభ్యులు తెలిపారు. ఇప్పటికే గిద్దలూరు, కొమరోలు, మండలాలలో రాజన్న భోజనశాల పేరిట రూ.5 కడుపునిండా భోజనం అందించే కార్యక్రమాన్ని 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని కామూరి రమణారెడ్డి అన్నారు.
కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఇమ్మడి తిరుపతయ్య, అధ్యక్షులు, వెంకటేశ్వర రెడ్డి, సహాయ అధ్యక్షుడు, తులసి ప్రసాద్, దద్దనాల గోపాల్, పరిషత్ పోయిన గోపాల్, నాగేశ్వరరావు, సంస్థ అధ్యక్షులు మేకల రామ్మోహన్రావు, కోశాధికారి వెంకటరాయుడు, కార్యక్రమానికి హాజరైన వారు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు స్వరూప రెడ్డి, బాదం గోపాల్, మోహన్ రెడ్డి, ఆర్గనైజర్ సెక్రెటరీ దూదేకులవలి, మెంబర్స్, నాగ సురేష్, ప్రసాద్, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.




