Devanakonda: దేవనకొండ రైతులకు తీపి కబురు.. సబ్సిడీ ధరకే వేరుశెనగ విత్తనాలు
Devanakonda: దేవనకొండ మండలంలో ఖరీఫ్ 2026 కోసం సబ్సిడీపై వేరుశెనగ విత్తనాల పంపిణీ. రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.
Devanakonda: దేవనకొండ రైతులకు తీపి కబురు.. సబ్సిడీ ధరకే వేరుశెనగ విత్తనాలు
Devanakonda: దేవనకొండ, మండలంలోని రైతులు ఖరీఫ్ సాగుకు సంబధించిన వేరుశెనగను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఉషారాణి తెలిపారు. మంగళవారం అమె విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ 2026కు సంబంధించి జనరల్ సీడ్ వేరుశెనగ కె6 రకం 750 క్వింటాలు మరియు టిసిజిఎస్-1694 అనే రకం 200 క్వింటా లు రావడం జరిగిందన్నారు.
కావున నేడు బుదవారం నుండి రైతు సేవా కేంధ్ర నందు మా సిబ్బంది వేరుశెనగ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు. రైతులు తమ ఆధార్, మొబైల్ ద్వారా రిజిస్ట్రే షన్ చేసుకోవాలన్నారు. క్వింటం 10,200 ఉండగా ప్రభుత్వం 4080 సబ్సిడీతో మిగిలిన 6120 నగదు చెల్లించి ఒక రైతు ఒక క్వింటం మాత్రమే తీసుకోచ్చన్నారు.
Next Story




