Nandikotkur: 'జగన్ 2.0 సూపర్ యాప్' ఆవిష్కరించిన డా. సుధీర్ దారా!

Nandikotkur: వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ దారా ఆధ్వర్యంలో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ. టీడీపీ అవినీతి, పంట బీమా మోసాలపై తీవ్ర స్థాయిలో ధ్వజం.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Updated on: 19 July 2026 1:34 PM IST
Nandikotkur
X

Nandikotkur: 'జగన్ 2.0 సూపర్ యాప్' ఆవిష్కరించిన డా. సుధీర్ దారా!

Nandikotkur: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన "జగన్ 2.0 సూపర్ యాప్" ను నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ సమన్వయకర్త *డా. సుదీర్ దారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. సుదీర్ దారా మాట్లాడుతూ, "పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజలకు నేరుగా, వేగంగా చేరవేయడంలో ఈ యాప్ ఎంతో కీలకంగా ఉపయోగపడుతుంది. జగన్ 2.0 సూపర్ యాప్ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేతిలో ఉండాల్సిన డిజిటల్ ఆయుధం. కార్యకర్తలకు, నాయకత్వానికి మధ్య వారధిగా ఈ యాప్ పనిచేస్తుంది" అని అన్నారు.

పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, దాని వినియోగ విధానాన్ని నాయకులు, కార్యకర్తలకు వివరించారు. ప్రతి కార్యకర్త తప్పనిసరిగా యాప్‌ను వినియోగించి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

అనంతరం డా. సుదీర్ దారా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. అమరావతి పేరుతో కోట్ల రూపాయల అవినీతికి చంద్రబాబు పాల్పడుతున్నారు" అని ఆరోపించారు.

నందికొట్కూరు మున్సిపాలిటీలో అవినీతి పెరిగిపోయిందని, 2.5 సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని అన్నారు. ముస్లిం మైనారిటీల కోసం నిర్మించిన షాదిఖానా ఇంకా ప్రారంభించకపోవడం, పగిడ్యాల రోడ్డుకు 3 కోట్లు మంజూరైనా రోడ్డు పనులు ప్రారంభించకపోవడంపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే సొంత గ్రామం అల్లూరులో అక్రమ ఎర్రమట్టి తరలింపు జరుగుతోందని, టీడీపీ నేతలు పంచభూతాలను కూడా వదలడం లేదని ఆరోపించారు.

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. "ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంట బీమా పేరుతో 120 కోట్లు రైతుల నుండి వసూలు చేశారు. ఎకరాకు 2 వేలు వసూలు చేసి, అదే పంటకు రుణం ఉంటే బీమా వర్తించదని దాచిపెట్టారు. ఇది రైతులను నిండా ముంచడమే. తడి గుడ్డతో గొంతు కోస్తున్న చంద్రబాబు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story