Srisailam: సుండిపెంటలో రోడ్డు పక్కన సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల మళ్లింపు
Srisailam: సుండిపెంట అక్కమహాదేవి గ్రాండ్ లాడ్జి సెప్టిక్ వ్యర్థాలను గ్రామంలోకి మళ్లించడంపై నిరసన. జూనియర్ కాలేజీ విద్యార్థులు, ప్రజల ఆరోగ్యంపై ఆందోళన.
Srisailam: సుండిపెంటలో రోడ్డు పక్కన సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల మళ్లింపు
శ్రీశైలం: శ్రీశైలం మండలం సుండిపెంట లో ఐ.టి.ఐ. సమీపన ఉన్న "అక్క మహదేవి గ్రాండ్, రెండు లాడ్జిల" సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను మరియు మురుగు నీటిని సదరు లాడ్జి యాజమాన్యం వారు చట్ట విరుద్ధంగా NH-765 రోడ్డు పక్కన కాల్వ తవ్వి, గ్రామంలోకి మళ్లించి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు, ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులకు, నివాస గృహాలకు, దిన వ్యాపారాలు జరుగు స్థలము దగ్గర ఉన్న కాలువకు ప్రభుత్వ అనుమతులు లేకుండా మళ్లించడం వలన అనేక అనారోగ్య ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉన్నందున, సదరు "సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను" గ్రామంలోకి మళ్లించకుండా తగు చర్యలు తీసుకునుట గురించి - అభ్యర్థన.
సుండిపెంట గ్రామం నందు ఐ.టి.ఐ.సమీపన గల "అక్కమహాదేవి గ్రాండ్" వారి రెండు లాడ్జిల సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలని, మురుగునీటిని గ్రామం బయట నుండి, NH-765 (నేషనల్ హైవే) రోడ్డునకు ఒక్క మీటర్ సమీపంలో, 3అడుగుల లోతు JCBతో తవ్వించి, సుమారు 400 మీటర్ల పొడవుగా కాలువ ద్వారా, గ్రామం మధ్యలో జనజీవనం సాగించే ప్రాంతానికి, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, ప్రజల, విద్యార్థుల ఆరోగ్యం ఇబ్బందులు కలిగేలా మళ్లించుచున్నారు.
అయ్యా ఈ ప్రాంతంలో జూనియర్ కళాశాల, ప్రాజెక్టు హై స్కూల్ ప్లే-గ్రౌండ్, నీటిపారుదల శాఖ కార్యాలయములు, ఎస్.బి.ఐ. బ్యాంక్ ఉన్నాయి. మరియు ఉదయాన్నే గ్రామ ప్రజలు అధికంగా రింగు పార్కు నందు మరియు పరిసర ప్రాంతాలలో వాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా ఉన్నారు. ముఖ్యంగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఇక్కడ ఉండటం వలన, సదరు నీరు గ్రామ ప్రజలందరికీ త్రాగునీరుగా ఉపయోగించు ప్రాంతాలు ఉన్న ప్రదేశానికి 'సెప్టిక్ ట్యాంకి వ్యర్థాలను, మురుగు నీటిని చట్ట విరుద్ధంగా వదిలి పెట్టడం వలన, అనేక ఇబ్బందులు, దుర్గంధం మరియు అనారోగ్యాలకు కారణమవుతున్నది.
మలమూత్ర విసర్జనకు సంబంధించిన వ్యర్థపదార్థాలను, మురుగునీరు అక్కమహాదేవి లాడ్జి యాజమాన్యంవారు అధికంగా ప్రజలు, ముఖ్యంగా జూనియర్ కాలేజ్ విద్యార్థులు సంచరించే బహిరంగ ప్రదేశాలకు మళ్లించడం చట్ట విరుద్ధము.లాడ్జిల వారు కానీ, అపార్ట్మెంట్ల వారు సెప్టిక్ ట్యాంకులు నిర్మించుకుని, సదరు సెప్టిక్ ట్యాంకులు నిండినప్పుడు సంబంధిత వాహనాల ద్వారా తరలిస్తుంటారని గమనించగలరు.
గ్రామం మధ్యలోని ఓపెన్ కాలువలకు ఎవరు మళ్లించరుగత కొన్ని సంవత్సరాలుగాప్రభుత్వాలు బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనలు జరగకుండా, ప్రభుత్వము "స్వచ్ఛభారత్"లో భాగంగాచర్యలుతీసుకుంటున్నారు.కావున పైన తెలిపిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి "అక్కమహాదేవి గ్రాండ్ లాడ్జిల" వారి మలమూత్ర విసర్జన వ్యర్థాలను గ్రామంలోనికి మళ్ళించకుండా, జూనియర్ కళాశాల, ప్రాజెక్టు హై స్కూల్ ప్లే గ్రౌండ్ నందు విద్యార్థులకు, నీటిపారుదల శాఖ కార్యాలయ సిబ్బందికి, బ్యాంకు సిబ్బందికి మరియు గ్రామ ప్రజలకు సదరు వ్యర్థాల ద్వారా ఇబ్బందులు కలగకుండా, దుర్వాసన, దుర్గంధం రాకుండా, ప్రజల అనారోగ్యాలకు హానికరం కాకుండా తగు చర్యలు తీసుకోగలరని ప్రజా సంఘ నాయకులు కోరుతున్నారు.




