Sundipenta: బ్యాంకుల భద్రతపై పోలీసుల నిఘా: ఏపీ గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌కు ఎస్‌ఐ నోటీసులు!
Sundipenta: నంద్యాల జిల్లా సుండిపెంటలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌కు టూ టౌన్ ఎస్‌ఐ గంటా సుబ్బారావు భద్రతా నోటీసులు జారీ చేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరాలు, పవర్ బ్యాకప్ మరియు వాచ్‌మెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
శ్రీశైలం: నంద్యాల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆత్మకూరు డిఎస్పీ పర్యవేక్షణలో శ్రీశైలం మండలం సుండి పెంట టూ టౌన్ ఎస్ఐ గంట సుబ్బారావు ఆధ్వర్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారికి సీసీ కెమెరాలు గురించి నోటీస్ ఇవ్వటమైనది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ మెజర్మెంట్స్ యాక్ట్ 2013 మేరకు బ్యాంకు నందు తప్పనిసరిగా లోపల బయట మరియు ఏటీఎం నందు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, అదే విధంగా వాచ్మెన్ల నియమించుకోవాలని, కరెంటు పోయినప్పుడు జనరేటర్ గాని సోలార్ సిస్టం గాని అందుబాటులో ఉండాలని ఇతర ముఖ్య జాగ్రత్తలు తెలియజేయడమైనది.
అంతట మేనేజర్ గారు ఆల్రెడీ సీసీ కెమెరాలు, వాచ్మెన్ ఉన్నారని అలాగె మీరు ఇంకా సూచించిన అదనపు సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటామని సుండిపెంట టూ టౌన్ ఎస్ ఐ గంట సుబ్బారావు తన సిబ్బందితో సానుకూలంగా స్పందించడం అయినది.
Next Story




