Nandyal: సున్నిపెంటలో 50 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నిక.. ఏకగ్రీవం దిశగా!

Nandyal: నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంటలో 50 ఏళ్ల తర్వాత తొలి సర్పంచ్ ఎన్నిక; దాఖలైన 5 నామినేషన్లు టీడీపీ మద్దతుదారులవే కావడంతో ఏకగ్రీవంపై చర్చ.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 20 Nov 2026 10:33 PM IST
Nandyal
X

Nandyal: సున్నిపెంటలో 50 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నిక.. ఏకగ్రీవం దిశగా!

నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది సర్పంచ్ అబ్యర్ది అభ్యర్థిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. సుమారు 50 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా సున్నిపెంటలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో, నియోజకవర్గం మొత్తం ఇదే విషయంపై ఆసక్తిగా చూస్తోంది.

నవంబర్ 18 నుంచి 20 వరకు జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. సున్నిపెంట సర్పంచ్ బరిలో నిలిచేందుకు మొత్తం 5 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు మెంబర్ స్థానాలకు 33 నామినేషన్లు వచ్చాయి.

అయితే, సర్పంచ్ స్థానానికి నామినేషన్లు వేసిన 5 కూడా టీడీపీ మద్దతుదారులే కావడంతో, సున్నిపెంట పంచాయతీ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాల నిరీక్షణ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లోనే ఏకగ్రీవం దిశగా అడుగులు పడుతుండటంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM