Sunnipenta: గిరిజన మహిళల ఆర్థిక పరిపుష్టికే ప్రాధాన్యం
Sunnipenta: సున్నిపెంట ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన మహిళల జీవనోపాధి, 'వెలుగు' పథకాల అమలుపై పీవో సమీక్ష నిర్వహించారు. ప్రతి మహిళనూ గ్రూపుల్లో చేర్చాలని ఆదేశం.
Sunnipenta: గిరిజన మహిళల ఆర్థిక పరిపుష్టికే ప్రాధాన్యం
సున్నిపెంట: నేడు ఐటీడీఏ కార్యాలయము నందు పి ఓ వెలుగు సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశములో ఐ టీ డి ఏ పరిదిలో ని 3 జిల్లాలు నంద్యాల, మార్కాపురం మరియు పల్నాడు లలో గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వెలుగు ఏ పి ఎం లు, సి సి లు మరియు క్షేత్ర స్థాయి సిబ్బంది అందరితో సమీక్ష కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి ప్రతి ఒక్క అంశంపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు అందులో భాగంగా ప్రధానంగా గిరిజన మహిళలు ఏ ఒక్క మహిళ కూడా గ్రూప్ నుండి దూరంగా ఉండకూడదు ప్రతి ఒక్క మహిళను గ్రూపులో చేర్చాలని సూచించారు.
వారి జీవనోపాధి మెరుగు కోసం ఉన్నతి, ట్రైకర్, బ్యాంకు లింకేజీ ల ద్వారా వారికి అర్హత కలిగిన సభ్యులకు అందరికీ కూడా లోన్ అవకాశం కల్పించాలని అలాగే పి ఎం వి డి వి కే కింద ఏర్పాటైన నన్నారి యూనిట్టు, మిర్చి పౌడర్ తయారి మరియు జ్యూట్ బాగ్ తయారి బ్రిక్స్ తయారి మరియు ఇస్తరాకుల తయారి యూనిట్ల ద్వారా గిరిజన మహిళల చేత అభివృద్ధిలోకి తీసుకురావాలని వాటి ద్వారా ఇన్కమ్ జనరేట్ కావాలని మార్కెటింగ్ పై కూడా సిబ్బందికి సలహాలు సూచనలు అందించారు ప్రతి గూడెంలో ఏ సభ్యురాలు కూడా ఆధార్ కార్డు , రేషన్ కార్డు లేని వారికి మంజూరు అయ్యే విధంగా చూడాలి అని గ్రామైక్య సంఘాల పరిధిలో జరిగే ప్రతి మీటింగ్ లో లైన్ డిపార్ట్మెంట్ల అందరినీ ఇన్వాల్వ్ చేసి గిరిజన మహిళలకు అవేర్నెస్ కల్పించాలి అని తెలియ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ అధికారి వారితో పాటు ఏ పి డి వెలుగు, ఏ పి ఎం లు, సి సి లు మరియు తదితరులు పాల్గొనటం జరిగింది.




