Kurnool: కర్నూలు జడ్పీ పీఠంపై ఆశావహుల కన్ను రేసులో ఐదుగురు కూటమి నాయకులు!

Kurnool: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై తీవ్ర ఉత్కంఠ. 20 స్థానాలతో కూటమి మెజార్టీ. రేసులో చౌడి ఉలిగయ్య, షేక్ సాధికా, గీతా కుమారి యాదవ్, కురువ శంకరమ్మ, గోవింద్ గౌడ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Nov 2026 10:25 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలు జడ్పీ పీఠంపై ఆశావహుల కన్ను రేసులో ఐదుగురు కూటమి నాయకులు!

Kurnool: కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరిని వరించనుంది..? జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కర్నూలు జిల్లాలో మొత్తం 26 జడ్పీటీసీ స్థానాలకు గాను కూటమి 20 స్థానాలను కైవసం చేసుకోవడంతో జడ్పీ చైర్మన్ పీఠంపై కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించింది.

అయితే చైర్మన్ పదవి కోసం ప్రధానంగా ఐదుగురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారిలో చౌడి ఉలిగయ్య – కోతాళం, షేక్ సాధికా – దేవనకొండ, మిద్దె గీతాకుమారి – తుగ్గలి, కురువ శంకరమ్మ – ఆదోని, గోవింద్ గౌడ్ – హోళగుంద.

ఈ ఐదుగురిలో జడ్పీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, పార్టీ అధిష్టానం నిర్ణయం కీలకంగా మారనున్నాయి.

మరోవైపు ఆశావహులు తమకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మొత్తానికి కర్నూలు జిల్లా పరిషత్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఐదుగురిలో అదృష్టం ఎవరిని వరిస్తుంది..? జడ్పీ చైర్మన్ కిరీటం ఎవరి సొంతం కానుంది..? అన్నది వేచి చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్