Markapuram: మార్కాపురంలో స్వయంగా చీపుర్లు పట్టిన కలెక్టర్ ఎమ్మెల్యే!

Markapuram: మార్కాపురం పట్టణంలో ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 16 May 2026 11:23 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో స్వయంగా చీపుర్లు పట్టిన కలెక్టర్ ఎమ్మెల్యే!

మార్కాపురం జిల్లా: మార్కాపురం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రజల్లో ప్రత్యేక చైతన్యాన్ని తీసుకొచ్చింది. మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని స్వయంగా చీపుర్లు పట్టుకుని రోడ్లను శుభ్రపరిచారు.

అమ్మవారి శాల రోడ్డులో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే ప్రజలతో కలిసి శుభ్రత పనులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. మార్కాపురం జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా ప్రజలకు జూటు సంచులను పంపిణీ చేసి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అవగాహన కల్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. “శుభ్రమైన పట్టణం – ఆరోగ్యమైన సమాజానికి నాంది” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం మార్కాపురం ప్రజల్లో స్వచ్ఛతపై మరింత చైతన్యాన్ని కలిగించింది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story