Yerragondapalem: రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే!

Yerragondapalem: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 91వ జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

PRABHU, RAZOLE
Updated on: 4 July 2026 4:12 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే!

ఎర్రగొండపాలెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య 91వ జయంతి వేడుకలను స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, పట్టణ అధ్యక్షులు కందూరు కాశీ విశ్వనాథ్, జిల్లా కార్యదర్శి కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, జడ్పీటీసీ విజయ్ భాస్కర్, సుబ్బారావు, కందూరు గురు, రమేష్, సంతోష్, సింగ ప్రసాద్, అరుణాబాయి, పెబ్బిశెట్టి శ్రీను, ఆర్యవైశ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రోశయ్య రాష్ట్ర అభివృద్ధికి అందించిన సేవలు, ఆయన రాజకీయ ప్రస్థానం, ప్రజా జీవితంలో చూపిన నిబద్ధతను నాయకులు స్మరించుకున్నారు

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story