Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక విస్తృత ప్రచారం!

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక మాచాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

G Jagadeesh, Pathikonda
Published on: 26 Oct 2026 2:06 PM IST
Devanakonda
X

Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక విస్తృత ప్రచారం!

Devanakonda: రాజకీయాలు పదవుల కోసం కాదు. ప్రజలకు సేవ చేయడానికి వేదిక కావాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలనే తన ఆశయానికి, కుటుంబ పెద్దల ఆశయాలను జోడిస్తూ దేవనకొండ మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె ప్రకటించారు.

మాచాపురం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆమె.. ప్రజల ఆశీర్వాదమే తనకు కొండంత బలమని పేర్కొంటూ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.వైద్య సేవల నుంచి ప్రజాసేవ వరకు.. ఇదే నా సంకల్పం

ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు సాగిన డాక్టర్ షేక్ సాధిక.. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా దేవనకొండ మండలానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచారు.

మండలంలోని 44 గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా అడుగులు వేస్తానని ఆమె తెలిపారు. పార్టీ అధిష్ఠానం, ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అక్కతో పాటు పార్టీ నాయకుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.

ప్రతి ఇంటి సమస్య నా సమస్యే.. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి

ఎన్నికల ప్రచారంలో భాగంగా అమ్మా.. అక్కా.. అన్నా.. అవ్వా.. తాతా.. చెల్లీ.. తమ్ముడూ అంటూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ డాక్టర్ సాధిక ఓట్లు అభ్యర్థించారు. వృద్ధుల ఆశీర్వాదాలు తీసుకుంటూ, మహిళలతో మమేకమవుతూ, యువతను ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రజాప్రతినిధిగా పనిచేయాలన్నదే తన అభిమతమని తెలిపారు.

నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. దేవనకొండ మండల అభివృద్ధికి కృషి చేస్తాను. వైద్య సేవలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామాల సమస్యల పరిష్కారానికి నా వంతు ప్రయత్నం చేస్తాను

అంటూ ఆమె చేసిన విజ్ఞప్తి ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మహిళలకు రాజకీయాల్లో అవకాశం.. చంద్రబాబుకు కృతజ్ఞతలుమహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించే నిర్ణయాల పట్ల డాక్టర్ సాధిక హర్షం వ్యక్తం చేశారు.

మహిళలు ఇంటికే పరిమితం కాకుండా రాజకీయాలు, ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. మహిళలకు అవకాశాలు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యల పట్ల మహిళల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

సంక్షేమం.. అభివృద్ధే టీడీపీ ప్రచారాస్త్రాలుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అక్క చేపడుతున్న ప్రజాసేవా కార్యక్రమాలు తనను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించాయని డాక్టర్ సాధిక వివరించారు.

జడ్పీటీసీగా తనను గెలిపిస్తే దేవనకొండ మండల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని హామీ ఇచ్చారు.సైకిల్ గుర్తుకు ఓటేయండి.. కూటమి అభ్యర్థులను గెలిపించండి

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి డాక్టర్ షేక్ సాధికను జడ్పీటీసీగా గెలిపించాలని, అలాగే టీడీపీ, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులకు కూడా ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.టీడీపీ మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్, సీనియర్ నాయకులు ఈదుల దేవరబండ సుభాన్, బండి గింజల రంగన్న, ఆకుల వీరేష్, కప్పట్రాళ్ల మల్లికార్జున, భాస్కర్, నెల్లిబండ మల్లికార్జున, రాజు తదితర నాయకులతో కలిసి డాక్టర్ సాధిక ప్రచారాన్ని నిర్వహించారు.

మాచాపురంలో ప్రారంభమైన ప్రచారం బండగట్టు, నెల్లిబండ, కె. వెంకటాపురం, బుర్రకుంట, కుంకనూరు, పొట్లపాడు, గ్రామాల్లో కొనసాగింది.

ఇప్పుడు దేవనకొండ మండల ప్రజల ముందున్నది ఒక ఎన్నికల అభ్యర్థన మాత్రమే కాదు.. ప్రజాసేవకు అవకాశం ఇవ్వాలన్న ఆమె విజ్ఞప్తి. ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలతో తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజల ఆశీర్వాదంతో ముందడుగు.. అభివృద్ధి లక్ష్యంగా ప్రయాణం

పదవి దక్కితే ప్రజలకు దూరమయ్యే నాయకురాలిగా కాకుండా, ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలవాలన్నదే తన ఆకాంక్ష అని డాక్టర్ షేక్ సాధిక ప్రచారంలో స్పష్టం చేశారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda