Alur: ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రారంభించిన టీడీపీ ఇంచార్జ్!

Alur: కర్నూలు జిల్లా ఆలూరు వాసవి కళ్యాణ మండపంలో ఆదోని మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ప్రారంభించారు.

Bheemalinga, Aluru
Published on: 13 July 2026 2:18 AM IST
Alur
X

Alur: ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రారంభించిన టీడీపీ ఇంచార్జ్!

ఆలూరు: పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఆదోని మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించి వైద్యులు, నిర్వాహకులను అభినందించారు.

అనంతరం సమావేశంలో వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో ఆలూరు వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు లేవని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదోని మధు హాస్పిటల్ వైద్యులు ఆలూరు నియోజకవర్గ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరఫున మధు హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర పథకంలో వర్తించని కొన్ని వ్యాధులకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. శిబిరానికి వచ్చిన నిపుణులైన వైద్యులతో ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే వారి సూచనల మేరకు మధు హాస్పిటల్‌లో ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర పథకం ద్వారా చికిత్స పొందవచ్చని వివరించారు.

అనంతరం శిబిరానికి వచ్చిన రోగులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story