Alur: ఘనంగా సైకిల్ ర్యాలీ: పాల్గొన్న టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి!
Alur: ఆలూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో విద్యార్థులు, అధికారులతో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
Alur: ఘనంగా సైకిల్ ర్యాలీ: పాల్గొన్న టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి!
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు, అధికారులు, టీడీపీ శ్రేణులతో కలిసి ఎంపీడీవో కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు భారత్ మాతాకీ జై, జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే బాలికల పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులతో కలిసి చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తున్నారని వైకుంఠం జ్యోతి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
రేపు నిర్వహించే 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని విద్యార్థులకు, ప్రజలకు వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, ఎంపీడీవో, ఉపాధ్యాయులు , టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. వైకుంఠం జ్యోతి టిడిపి ఇన్చార్జ్ ఆలూరు.




