Nandikotkur: పట్టణాభివృద్ధే ధ్యేయం.. కూటమి అభ్యర్థులను గెలిపించండి!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ 21వ వార్డు టీడీపీ అభ్యర్థిని కె. ఈశ్వరమ్మ విజయాన్ని ఆకాంక్షిస్తూ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి ఇంటింటి ప్రచారం.
Nandikotkur: పట్టణాభివృద్ధే ధ్యేయం.. కూటమి అభ్యర్థులను గెలిపించండి!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ లోని 21వ వార్డు అభ్యర్థిని కె.ఈశ్వరమ్మకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వానికి మద్దతు నిచ్చి , తమ అభ్యర్థి ఈశ్వరమ్మకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మునుపెన్నడూ జరుగని విధంగా పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని,మరింత అభివృద్ధిని సాధించాలి అంటే ఈశ్వరమ్మ ను గెలిపించాలని కోరిన శివానందరెడ్డి.
పట్టణంలో అభివృద్ధి జరగాలి అంటే టీడీపీ కి ఓటు వేసి 21వ వార్డు అభ్యర్థి కె.ఈశ్వరమ్మను,అలాగే చైర్మన్ అభ్యర్థి.మొల్ల సాబేరున్నిసాను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఈశ్వరమ్మ భర్త గోవిందాచారికి ఈ వార్డులో మంచి పరిచయాలు ఉండటం ,వివాదరహితుడిగా పేరు వుండటం వీరికి కలిసివచ్చే అవకాశం ఉంది.
మీ ఇంటి ఆడపడచుగా ,మీ లో ఒకరిగా ఉంటూ అనునిత్యం వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వాగ్దానం చేస్తూ, ఓటును అభ్యర్థిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటుంది.
ఈ ప్రచారం లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి భర్త మొల్ల జాకీర్ హుస్సేన్(అడ్వకేట్) , ఎల్లయ్య ఆచారి, ఇబ్రహీం ఖాన్,రాఘవేంద్ర ఆచారి, ఆనందాచారి పాల్గొన్నారు.




