Alur: బీసీలు, దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు: టీడీపీ నాయకులు!

Alur: సంగాల గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి దాడిలో గాయపడిన శేఖర్ యాదవ్ కుటుంబాన్ని టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, బాలాజీ యాదవ్ పరామర్శించారు.

Bheemalinga, Aluru
Published on: 4 Aug 2026 10:08 PM IST
Alur
X

Alur: బీసీలు, దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు: టీడీపీ నాయకులు!

కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన అనుచరులు దాడిలో తీవ్రంగా గాయపడిన శేఖర్ యాదవ్ కుటుంబాన్ని టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో యాదవ టిడిపి లీడర్స్ టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు బాలాజీ, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి పరామర్శించారు.

బాధిత రాష్ట్రంలో యాదవ కుటుంబాలను సర్వనాశనం చేయాలని దురుద్దేశంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి యాదవులు దళితులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమంతో ప్రజలు కుటుంబ ప్రభుత్వానికి ఆకర్షితులవుతున్నారని దాని జీర్ణించుకోవాలని వైకాపా అల్లరి మూకాలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఆయన మెప్పు పొంది మరోసారి టికెట్ ఆశించేందుకు ఎమ్మెల్యే విరుపాక్షి బీసీలు దళితులపై దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇక్కడ జరిగిన దురాగతాలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ప్రజలకు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు.. బాలాజీ యాదవ్, నరసింహ యాదవ్ ....రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్, నాగేశ్వర్ యాదవ్.. కేడీసీఎంఎస్ చైర్మన్...జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్టమ్మా...ఆలూరు టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story