Markapuram: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత: పఠాన్!
Markapuram: 9వ బ్లాక్‌లో ఒక నిరుపేద కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం టీడీపీ నాయకులు రూ. 5,000 ఆర్థిక సహాయం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
Markapuram: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత: పఠాన్!
మార్కాపురం: పట్టణంలోని 9వ బ్లాక్‌లో ఓ నిరుపేద కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.5,000ల ఆర్థిక సహాయాన్ని టీడీపీ నాయకులు అందించారు.
బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ ఇబ్రహీంఖాన్, 9వ బ్లాక్ టీడీపీ ఇన్‌చార్జ్ పఠాన్ నాగూర్ ఖాన్ సంయుక్తంగా బాధిత కుటుంబానికి నగదు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కండేయ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లికార్జున శర్మ, 9వ బ్లాక్ టీడీపీ అధ్యక్షుడు శేఖర్ నాయుడు, టీడీపీ నాయకులు బొప్పరాజు బాలాజీ, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




