Mantralayam: వైసీపీ ఎమ్మెల్యే సొంత గ్రామాల్లో టీడీపీ ప్రచార హోరు!
Mantralayam: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రామాపురం, దిబ్బన దొడ్డి, బసాపురం గ్రామాల్లో భారీ బందోబస్తు మధ్య టీడీపీ ఎన్నికల ప్రచారం.
Mantralayam: వైసీపీ ఎమ్మెల్యే సొంత గ్రామాల్లో టీడీపీ ప్రచార హోరు!
Mantralayam: తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి , జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో ప్రచారం భాగంగా భారీ బందోబస్తు మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ.
నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ వైసిపి ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సొంత గ్రామాలైన ఊర్లో ఇతర పార్టీ నాయకులు ప్రచారాలు చేయడం నిషేధించాడు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రాఘవేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జెడ్పిటిసి అభ్యర్థులను వెంటబెట్టుకొని మూడు గ్రామాల్లో ప్రచార పర్వం కొనసాగించాడు.




