Emmiganuru: ఎమ్మిగనూరులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
Emmiganuru: ఎమ్మిగనూరులో టీడీపీ 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' వర్క్‌షాప్.
Emmiganuru: ఎమ్మిగనూరులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు, ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మార్గ దర్శకత్వం లో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి పని చేస్తున్నారని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్ర శేఖర్ అన్నారు.
టిడిపి ఆదేశాల మేరకు పట్టణంలోని కుర్ణి కళ్యాణ మండపం లో టిడిపి క్లస్టర్లు, యూనిట్లు, బూత్ కన్వీనర్లు, గ్రామ/వార్డు కమిటీలు, మండల, పట్టణ కమిటీ సభ్యులకు బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్ఎ లు)కు పాత్ర, బాధ్యతలు సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐఆర్ ) వర్కుషాప్, ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిం చారు. ఈ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ శిక్షణ లో ఇంటింటి ఓటరు ధృవీక రణ, (డోర్ –టు -డోర్ - వెరిఫికేషన్), ఓటర్ల కుటుంబ వృక్షం (ఫ్యామిలీ ట్రీ ) ఆధారంగా మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారమ్ నమోదు చేసే విధానం, ఓటరు వివరాల పరిశీలన, సర్ అప్లోడింగ్, మైటీడీపి యాప్ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియలపై ట్రైనర్ వినయ్ సవివరంగా శిక్షణ అందించారు.
అనం తరం కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ క్లస్టర్లు, యూనిట్లు, బూత్ కన్వీనర్లకు బిఎ ల రోల్స్ & రెస్పాన్సిబిలిటీస్, సర్ ప్రక్రియకు సంబం ధించిన మార్గదర్శక పుస్తకాలను పంపిణీ చేశారు. ఓటరు జాబితాల్లో పారదర్శకత, ఖచ్చితత్వం, ప్రతి అర్హుడైన ఓటరు నమోదు లక్ష్యంగా ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని నాయకులు పిలు పునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మహేష్ కేటీ వెంకటేష్, తిరుపతయ్య నాయుడు, కాసీమ్ వలి, జగదీష్ తో పాటు ట్రైనర్ వినయ్, క్లస్టర్లు, యూనిట్లు, బూత్ కన్వీనర్లు, గ్రామ/వార్డు కమిటీలు, మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు.




