Giddalur: 9వ వార్డులో జోరుగా ఎలిశెట్టి రవణమ్మ ఇంటింటి ప్రచారం!

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ 9వ వార్డు టిడిపి అభ్యర్థి ఎలిశెట్టి రవణమ్మ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 22 Oct 2026 11:44 AM IST
Giddalur
X

Giddalur: 9వ వార్డులో జోరుగా ఎలిశెట్టి రవణమ్మ ఇంటింటి ప్రచారం!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డు నుంచి టిడిపి అభ్యర్థి ఎలిశెట్టి రవణమ్మ ఆమె భర్త ఎలిశెట్టి వెంకటప్ప ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి బలపరిచిన తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎలిశెట్టి రవణమ్మ స్థానిక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలపై తనకు అవగాహన ఉందని ప్రజలకుఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని రవణమ్మ ఓటర్లకు హామీ ఇచ్చారు. త్వరలో జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU