Devanakonda: సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకోవాలి: హెచ్‌ఎం ఉచ్చరప్ప!

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలోని ఎఫ్ఆర్ హైస్కూల్లో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

G Jagadeesh, Pathikonda
Published on: 5 Sept 2026 5:19 PM IST
Devanakonda
X

Devanakonda: సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకోవాలి: హెచ్‌ఎం ఉచ్చరప్ప!

దేవనకొండ: విద్యార్థులకు దివంగత భారత రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ ఆదర్శంగా తీసుకొని తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉచ్చరప్ప కరస్పాండెంట్ పి. రఘునాథ్ తెలిపారు.

మండల కేంద్రమైన దేవనకొండ ఎఫ్ఆర్ హైస్కూల్లో ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించినట్లు రఘునాథ్ తెలిపారు. ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉచ్చిరప్ప అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులు మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని విద్యను కొనసాగించాలని అన్నారు. రేపటి దేశ భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయించేది నేటి బాలలేనని అన్నారు.

నేటి విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి దేశ భవిష్యత్తును నూతన వరవడిలో నిర్మించగలరని వారు అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేతి నేటి ఉపాధ్యాయులు అని అన్నారు. ఉపాధ్యాయులు పట్ల సమాజం నిరంతరము గౌరవప్రదంగా వారిని చూడాలని అన్నారు. విద్యార్థులకు నేటి తల్లిదండ్రులే ఉత్తమ గురువులని ఆ తర్వాత సమాజ గురువులని పాత్ర గణనీయమైనదిగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షబానా, లక్ష్మి, స్రవంతి, ఝాన్సీ, భవాని, సహిదా,రంగస్వామి ,గోపాల్, రమేష్, గోపాలు ఎస్ఎండి భాష, విజయలక్ష్మి, మహేశ్వరి, ఉషారాణి, మున్ని, లక్ష్మి, శాంతి ,మౌనిక, సంధ్య, జహీదా ,మౌనిక, నాగవేణి, పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story