Kurnool: గుండ్రేవుల ప్రాజెక్టుకు తెలంగాణ నేత మద్దతు!

Kurnool: కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో గుండ్రేవుల ప్రాజెక్టు సాధన కోసం చేపట్టిన 3 లక్షల సంతకాల సేకరణకు తెలంగాణ ఆర్‌డీఎస్ లెఫ్ట్ కెనాల్ మాజీ చైర్మన్ డి.సీతారాం రెడ్డి మద్దతు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 10 Oct 2026 10:59 AM IST
Kurnool
X

Kurnool: గుండ్రేవుల ప్రాజెక్టుకు తెలంగాణ నేత మద్దతు!

Kurnool: కర్నూలు ప్రగతి సమితి చేపట్టిన గుండ్రేవుల ప్రాజెక్టు సాధన కోసం 3 లక్షల సంతకాల సేకరణ కార్యక్రమానికి తెలంగాణ ఆర్‌డీఎస్ లెఫ్ట్ కెనాల్ మాజీ చైర్మన్ డి.సీతారాం రెడ్డి మద్దతు ప్రకటించారు. శుక్రవారం వడ్డేపల్లి మండలం తనగాలపల్లెలోని ఆయన నివాసంలో కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.శ్రీహర్ష భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణకు సంబంధించిన ప్రతులను సీతారాం రెడ్డికి అందజేశారు. తెలంగాణలోనూ సంతకాలు సేకరించి అందజేస్తామని ఆయన తెలిపారు.

శ్రీహర్ష మాట్లాడుతూ గుండ్రేవుల ప్రాజెక్టు కర్నూలు జిల్లా తాగునీరు, సాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రయోజనాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కలిసి పనిచేస్తామన్నారు. కర్నూలు ప్రగతి సమితి చేపట్టనున్న తదుపరి సమావేశాలు, కార్యక్రమాల్లో తెలంగాణ నాయకుల మద్దతుతో ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.

డి.సీతారాం రెడ్డి మాట్లాడుతూ.. గుండ్రేవుల ప్రాజెక్టు ఆవశ్యకతను రెండు రాష్ట్రాల ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. తాగునీరు, సాగునీరు, పారిశ్రామికాభివృద్ధికి ప్రాజెక్టు అందించే ప్రయోజనాలపై ఉమ్మడిగా అవగాహన కల్పిస్తామన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు సాధన కోసం కర్నూలు ప్రగతి సమితి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కేపియస్ సభ్యులు పులకుర్తి భాస్కర్ రెడ్డి, నౌషద్, సి.హెచ్.శ్రీనివాసులు, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL