Nandyal: నంద్యాల జిల్లాలో తాత్కాలిక జడ్పీ కార్యాలయం ప్రారంభం!

Nandyal: నంద్యాల జిల్లాలో తాత్కాలిక జడ్పీ కార్యాలయాన్ని కలెక్టర్ రాజకుమారి ప్రారంభించి, కొత్త జిల్లా తొలి స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

R Pavankalyan, Nandyal
Published on: 25 Sept 2026 6:59 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల జిల్లాలో తాత్కాలిక జడ్పీ కార్యాలయం ప్రారంభం!

Nandyal: నంద్యాల జిల్లాలో జిల్లా పరిషత్ కార్యకలాపాలకు శ్రీకారం చుడుతూ తాత్కాలిక జడ్పీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. అనంతరం కొత్త జిల్లాకు తొలి స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి, గ్రామ స్థాయి నుంచి అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు.

నంద్యాలలో తాత్కాలిక జిల్లా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు రెవెన్యూ, జడ్పీ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

కార్యాలయ ప్రారంభం అనంతరం నంద్యాల జిల్లా తొలి స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కొత్త జిల్లాకు తొలి స్పెషల్ ఆఫీసర్‌గా సేవలందించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు.

నంద్యాల జిల్లాలో సమృద్ధిగా సహజ, వ్యవసాయ వనరులు ఉన్నాయని, గ్రామ స్థాయి నుంచి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విష్ణునాథ్, కమిషనర్ శేషన్నతో పాటు రెవెన్యూ, జడ్పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal