Giddalur: గిద్దలూరు MPDO కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Giddalur: గిద్దలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాలు చించివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
Giddalur: గిద్దలూరు MPDO కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
Giddalur: స్థానిక ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిద్దలూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో తిమ్మాపురం గ్రామానికి చెందిన అభ్యర్థులు నాగార్జున, శీను నామినేషన్ పత్రాలను కూటమి నేతలు కొందరు చించివేశారని వారు ఆరోపించారు.
ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ పత్రాల చించివేతను నిరసిస్తూ వారు ఆందోళనకు దిగారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ నామినేషన్ వేయడానికి వచ్చిన వారు నిరసన వ్యక్తం చేశారు. ఘటన నేపథ్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.




