Markapuram: మార్కాపురంలో వరుణుడి ప్రభావం.. యోగా కార్యక్రమానికి అడ్డుపడ్డ వర్షం!
Markapuram: మార్కాపురంలో భారీ వర్షం కారణంగా థీమెటిక్ యోగా కార్యక్రమం వాయిదా.
Markapuram: మార్కాపురంలో వరుణుడి ప్రభావం.. యోగా కార్యక్రమానికి అడ్డుపడ్డ వర్షం!
Markapuram: మార్కాపురం పట్టణంలోని జిల్లా బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించాల్సిన థీమెటిక్ యోగా కార్యక్రమం వర్షం కారణంగా వాయిదా పడింది. వర్షపు నీరు మైదానంలో నిలిచిపోవడంతో కార్యక్రమ నిర్వహణకు ఆటంకం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత , జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు సంబంధిత అధికారులతో కలిసి పాఠశాల క్రీడామైదానాన్ని పరిశీలించారు. మైదానంలో నీరు నిల్వ ఉండటం, విద్యార్థుల భద్రత దృష్ట్యా యోగా కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు.
మైదానంలోని నీటిని త్వరితగతిన తొలగించి, పరిస్థితులు అనుకూలించిన వెంటనే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశించారు.




