Nandyal: కొలను భారతి క్షేత్రంలో మూలా నక్షత్ర వేడుకలు
Nandyal: కొలను భారతి క్షేత్రంలో మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి ఆలయం భక్తులతో పోటెత్తింది. చిన్నారులకు బీజాక్షర అక్షరాభ్యాసాలు నిర్వహించారు.
Nandyal: కొలను భారతి క్షేత్రంలో మూలా నక్షత్ర వేడుకలు
నంద్యాల: దేవి నవరాత్రుల్లో మూల నక్షత్రం సరస్వతి అమ్మవారికి విశేషమైన దినం. ఈరోజు అమ్మవారు భక్తులకు శ్రీ సరస్వతి దేవి నిజరూప దర్శనాన్ని కలిగించారు.
శ్రీశైలం దేవస్థానం దత్తత ఆలయం శ్రీ కొలను భారతి క్షేత్రంలో ఆలయ ప్రధాన అర్చకులు గంట్యాలా శ్రీనివాస శర్మ ప్రాత కాలంలో అమ్మవారి మూలవిరాట్ ను చారు భూషిని జలాలతో అభిషేకించి నక్షత్ర విశేష క్రతువులను ఆరంభించారు.
చిన్నారులకు సరస్వతి దేవి సమక్షంలో అక్షరాభ్యాస, బీజాక్షర లిఖిత క్రతువులను పెద్ద పండితులు నిర్వహించారు. అమ్మవారికి మధ్యాహ్నం కాల పూజ, మహనివేదన, సాయం సంధ్య నివేదన, మహా మంగళ హారతి తో పేద పండితులు మూలా నక్షత్ర యుక్త క్రతువులకు పరిసమాప్తి పలికారు.
కర్ణాటక, తెలంగాణ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు నుంచి భక్తులు శ్రీ కొలను భారతి క్షేత్రానికి అమ్మవారిని దర్శించి సేవించుకున్నారు.




