Kurnool: దేవనకొండలో విషాదం.. మూడు బాల్య వివాహాలపై కలకలం!

Kurnool: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి. కోటకొండలో ఒకేసారి మూడు బాల్య వివాహాలు జరిగినట్లు సమాచారం.

G Jagadeesh, Pathikonda
Published on: 20 April 2026 4:03 PM IST
Kurnool
X

Kurnool: దేవనకొండలో విషాదం.. మూడు బాల్య వివాహాలపై కలకలం!

Kurnool: దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామంలో బాల్య వివాహాలు జరిగినట్లు వెలువడిన సమాచారం స్థాని కంగా చర్చనీయాంశమైంది. ఒకేసారి మూడు బాల్య వివాహాలు జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలు సమాజంలో ఆందోళన కలిగించగా, బాలల హక్కుల పరిరక్ష ణపై ఉన్న వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేశాయి. ఈ ఘటనకు సంబంధించి పలు వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయాల ప్రకారం,

బాల్య వివాహాల నివారణకు చట్టపరంగా ఏర్పాటైన యంత్రాంగం సమర్థంగా పనిచేయాల్సిన అవసరం మరోసారి స్పష్టమవుతోంది. బాల్య వివాహాలు చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా, బాలల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశమని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా రు.

విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం ఐసిడి ఎస్ సిబ్బంది జోక్యం చేసుకుని సంబంధిత కుటుం బాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ వివాహాలు జరిగాయన్న అంశాలు అధికారిక విచారణ ద్వారా స్పష్టమవాల్సి ఉంది. ప్రభుత్వం రూపొందించిన చట్టాలు కేవలం పుస్తకాలపైనే కాకుండా క్షేత్రస్థాయి లో సమర్థంగా అమలు కావాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహాల నివారణలో రెవిన్యూ, పోలీస్, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయం అత్యంత కీలకం.

ఏదైనా లోపం జరిగినట్లయితే దానిపై పార దర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడం అవసరం. ఇలాంటి ఘటనలు వెలుగు లోకి వచ్చినప్పుడు వాటిని చిన్నచూపు చూడకుండా, వ్యవస్థను బలోపేతం చేసే దిశగా పాఠాలు నేర్చుకో వడం అత్యవసరం. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు,

పర్యవేక్షణ వ్యవస్థలు మరింత బలపడితేనే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీసి, అవసరమైన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. బాలల భవిష్యత్తు రక్షణ అన్నది సమాజం మొత్తం బాధ్యతగా భావించి ప్రతి స్థాయిలో అప్రమత్తత పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story