Peddaraveedu: బోడిరెడ్డిపల్లెలో పెద్దపులి సంచారం కలకలం.. వైరల్ ఫేక్ వీడియో!
Peddaraveedu: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లెలో పెద్దపులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో ఫేక్ వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయపడుతున్నారు.
Peddaraveedu: బోడిరెడ్డిపల్లెలో పెద్దపులి సంచారం కలకలం.. వైరల్ ఫేక్ వీడియో!
పెద్దారవీడు: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లె గ్రామంలో పెద్దపులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటి ఆవరణలో పెద్దపులి నీరు తాగుతున్న దృశ్యాలంటూ ఓ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. స్థానిక యువకులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వీడియో అంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ వీడియో నిజంగా బోడిరెడ్డిపల్లె గ్రామానికి సంబంధించినదేనా? లేక ఫేక్ వీడియోనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గ్రామంలో పెద్దపులి సంచరిస్తోందన్న ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, పశువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపులి వీడియోపై మార్కాపురం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత? వీడియో నిజానిజాలేమిటి? అనే విషయాలపై అటవీశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రజలు ధృవీకరించని వీడియోలను షేర్ చేయవద్దని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.




