Nandikotkur: నామినేషన్ల నేపథ్యంలో బ్రహ్మకోట్కూర్ సచివాలయం వద్ద భారీ బందోబస్తు!

Nandikotkur: నందికొట్కూరు మండలం బ్రహ్మకోట్కూర్ సచివాలయం వద్ద పంచాయతీ నామినేషన్ల నేపథ్యంలో రూరల్ సీఐ సుబ్రమణ్యం ఆదివారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 22 Nov 2026 3:37 PM IST
Nandikotkur
X

Nandikotkur: నామినేషన్ల నేపథ్యంలో బ్రహ్మకోట్కూర్ సచివాలయం వద్ద భారీ బందోబస్తు!

నందికొట్కూరు, నంద్యాల జిల్లా: నందికొట్కూరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నామినేషన్ల సమయంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు.

ఇందులో భాగంగా బ్రహ్మకోట్కూర్ గ్రామ సచివాలయం వద్ద నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం స్వయంగా పరిశీలించారు.

సచివాలయం వద్దకు భారీగా తరలివచ్చే అభ్యర్థులు, వారి అనుచరులతో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, క్యూ లైన్లు పాటించేలా చర్యలు తీసుకున్నారు. నామినేషన్ కేంద్రం లోపలికి ఒక్కొక్కరినే అనుమతించేలా ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా సీఐ సుబ్రమణ్యం మాట్లాడుతూ..

నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలి. అభ్యర్థులు సచివాలయం వద్ద గుమిగూడి నినాదాలు చేయడం, ప్రత్యర్థులను బెదిరించడం వంటివి చేయరాదు. నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా ఉంచాం" అని స్పష్టం చేశారు.

నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. బ్రాహ్మణకోట్కూర్ ఎస్ . ఐ మణికంఠ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)