Markapur: మార్కాపురంలో ఘనంగా తిరంగా ర్యాలీ; ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా!

Markapur: మార్కాపురంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 13 Aug 2026 11:59 AM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో ఘనంగా తిరంగా ర్యాలీ; ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా!

Markapur: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని “దేశ నిర్మాణంలో భాగస్వాములం” అనే నినాదంతో మార్కాపురం జిల్లా కేంద్రంలో ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.

స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని ఉత్సాహంగా పాల్గొన్నారు.

దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ, దేశసేవ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగింది. దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలని సందేశాన్ని అందించారు.

యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఆయనతోపాటు డి.ఎస్.పి నాగరాజు , సీఐ అల్తాఫ్ హుస్సేన్ పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story