Komarolu: కొమరోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి

Komarolu: మార్కాపురం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ వద్ద అమరావతి-అనంతపురం హైవేపై లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో కొత్తకోట రాజు అనే యువకుడు మృతి చెందాడు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 26 Sept 2026 5:17 PM IST
Komarolu
X

Komarolu: కొమరోలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి

మార్కాపురం జిల్లా: కొమరోలు మండలం దద్దవాడ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, దిచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

మృతుడు రాచర్ల మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన కొత్తకోట రాజుగా పోలీసులు గుర్తించారు. మృతుడికి వివాహమై 18 నెలలు అయ్యిందని 6 నెలల పాప ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

జరిగిన రోడ్డు ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి క్లియర్ చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU