Kurnool: కర్నూలు జిల్లాలో వీఆర్ఓపై దాడి కేసులో ఇద్దరు అరెస్టు!
Kurnool: కర్నూలు జిల్లా సి బెళగల్ మండలంలో వీఆర్ఓ గోపాల్ పై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Kurnool: కర్నూలు జిల్లాలో వీఆర్ఓపై దాడి కేసులో ఇద్దరు అరెస్టు!
Kurnool: కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలంలో వీఆర్ఓ గోపాల్‌పై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను సి. బెళగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. బోయ తిరుమలేష్, బోయ దస్తగిరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
వీఆర్ఓ గోపాల్‌కు, నిందితులకు మధ్య ఉన్న వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సి.బెళగల్ ఎస్.ఐ వేణుగోపాల్ రాజు తెలిపారు
కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ సింగ్, కానిస్టేబుల్స్ కిషోర్, శ్రీరాములు కీలకంగా వ్యవహరించారని అభినందించి రివార్డులు అందజేశారు.
ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని, వ్యక్తిగత కక్షలతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా సమస్యలను చట్టపరమైన మార్గంలో పరిష్కరించుకోవాలని ఎస్.ఐ వేణుగోపాల్ రాజు సూచించారు.




