Srisailam: శ్రీశైలం మల్లన్న సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు!

Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 15 Jun 2026 10:42 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం మల్లన్న సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు!

శ్రీశైలం: శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు,అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రీస్వామివారికి రుద్రాభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు.

దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేదపండితులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్లకు చిత్రపటం,తీర్థ ప్రసాదాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు అందజేసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎంతో ప్రాముఖ్యమైన శ్రీశైల ఖండం బుక్ కూడా ఈవో శ్రీనివాసరావు అందజేశారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story