Nandikotkur: వడ్డెమాన్ గ్రామంలో అంధకారంలో దళిత కాలనీలు!
Nandikotkur: నందికొట్కూరు మండలం వడ్డెమాన్ దళిత కాలనీల్లో 4 నెలలుగా చీకట్లు. వీధి దీపాలు వేయకపోవడంపై పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.
Nandikotkur: వడ్డెమాన్ గ్రామంలో అంధకారంలో దళిత కాలనీలు!
Nandikotkur: నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డెమాను గ్రామంలోని దళిత కాలనీలలో గత కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో ఎస్సీ మరియు బీసీ కాలనీలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాత్రి వేళలో గ్రామం పురవీధులు మరియు మెయిన్ రహదారి వివిధ కాలనీలు సైతం మొత్తం చీకటి మాయం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలన్నా రాకపోకలు సాగించాలన్న ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది.
వీధి దీపాలు వెలిగించేది ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.. వీధి దీపాల నిర్వహణపై సంబంధిత పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని ప్రజలు ప్రత్యక్షంగా విమర్శిస్తున్నారు. గ్రామం పురవీధులతో పాటు ప్రధాన వీధులు మరియు కాలనీ లో ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభాలకు దీపాలు ఉన్నప్పటికీ అవి వెలగకపోవడంతో రాత్రి వేళలో దారి కనిపించని పరిస్థితి నెలకొంది.
గత కొన్ని రోజులుగా సమస్య కొనసాగుతున్న అధికారులు శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై కాలనీవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ కాలనీ మరియు రజక వీధిలో ఉన్న చేతి పంపు బోరు కోసం త్రాగునీటి కోసం వెళ్లాలన్నా , అత్యవసర పరిస్థితుల్లో వైద్యశాలకు వెళ్లాల్సి వచ్చిన చిమ్మ చీకటి నెలకొనడంతో పాములు , తేలు , కొండచిలువలు ,విష పురుగులు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .మహిళలు ,వృద్ధులు, చిన్నపిల్లలు రాత్రి సమయం లో బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.
అంతేగాక వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళలో చీకటి కారణంగా రోడ్లపై గుంతలు మరియు స్పీడ్ బ్రేకర్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఎస్సీ కాలనీవాసులు వీధిలైట్ల సమస్యపై పలుమార్లు స్థానిక పంచాయతీ కార్యదర్శి కి ఫోన్ చేసిన ఈరోజు మరుసటి రోజు అంటూ కాలయాపన చేశారే తప్పా..! ఫలితం మాత్రం శూన్యం అన్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయడమే కాకుండా అవి నిరంతరం పనిచేసేలా పర్యవేక్షణ చేయాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ ను కలిసి కాలనీవాసుల సమస్యలపై ఫిర్యాదు చేస్తామన్నారు.




