Kurnool: డీఎస్సీ విజేతల కష్టాన్ని రాజకీయాలతో అపహాస్యం చేస్తారా? - కప్పట్రాల్లా బొజ్జమ్మ ఫైర్!
Kurnool: డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలను ఖండించిన వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల్లా బొజ్జమ్మ.
Kurnool: డీఎస్సీ విజేతల కష్టాన్ని రాజకీయాలతో అపహాస్యం చేస్తారా? - కప్పట్రాల్లా బొజ్జమ్మ ఫైర్!
కర్నూలు జిల్లా: దేవనకొండ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ నియామకాలపై వైసీపీ పార్టీ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల్లా బొజ్జమ్మ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు తమ ప్రతిభ, కష్టం, పట్టుదలతో ఉద్యోగాలు సాధించారని, వారి విజయాలను గొడ్డలి పార్టీ రాజకీయ కోణంలో చూడడం సరైన విధానం కాదని ఆమె అన్నారు. కూలీ కుటుంబాలు, రైతు కుటుంబాలు, సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎన్నో త్యాగాలు చేసి, కష్టపడి చదివి ఈ విజయాలను సాధించారని తెలిపారు.
డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించారని, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించారని చెప్పారు. ప్రతిభను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఎంపికలు జరిగాయని పేర్కొన్నారు.
ఉద్యోగాలు సాధించిన యువత శ్రమను గౌరవించాల్సిన అవసరం ఉందని, ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు పొందిన ప్రతి అభ్యర్థి విజయం వెనుక వారి కుటుంబాల త్యాగాలు, వారి నిరంతర శ్రమ ఉన్నాయని గుర్తు చేశారు.
ఉద్యోగాలు ఎవరి దయాదాక్షిణ్యాలతో రావు. కష్టపడి చదివిన వారి ప్రతిభకు లభించిన గుర్తింపే ఈ ఉద్యోగాలు. రాష్ట్రంలో ఉద్యోగాలు సాధించిన ప్రతి యువకుడు, యువతి గర్వపడేలా ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించింది. వారి విజయాలను అభినందించాలి గానీ, అవాస్తవ ప్రచారాలతో వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు అని కప్పట్రాల్లా బొజ్జమ్మ పేర్కొన్నారు.




