Veldanda: వెల్దండలో ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు

Veldanda: వెల్దండ రైతు వేదికలో ఎల్ నినో ప్రభావంపై అవగాహన సదస్సు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టి లాభాలు గడించాలని సర్పంచ్ మట్ట యాదమ్మ సూచన.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 30 July 2026 8:24 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు

వెల్దండ: నాగర్ కర్నూల్ వెల్దండ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించినా గ్రామ సభ సమావేశంలో ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని రైతులు ప్రత్యమ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.

వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ రోజు ఎల్ నినో ప్రభావం పై అవగాహన సదస్సులో మాట్లాడుతూ రైతులు ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా ఉంటుందని అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో రైతులు ప్రత్యమ్నాయ పంట లను సాగు చేసుకోవాలని, తద్వారా పంట మార్పిడి చేయడం ద్వారా ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సులోచన, మండల వ్యవసాయాధికారి శోభ రాణి, ఏఈఓ రాజు, పంచాయతీ కార్యదర్శి గిరి, ఉప సర్పంచి బస్నమోని శ్రీనివాస్ , వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story