Kalwakurthy: అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి గోలి శ్రీనివాస్ రెడ్డి
Kalwakurthy: వెల్దండ మండలం పోతేపల్లిలో ఓటరు జాబితా సవరణను పరిశీలించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆదేశం.
Kalwakurthy: అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి గోలి శ్రీనివాస్ రెడ్డి
కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం లోనీ పొతేపల్లి, యంగం పల్లి, జిల్లెల, మార్చర్ల గ్రామాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం గారితో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి, బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)లకు పలు సూచనలు చేశారు. మరో పది రోజుల్లో ఓటరు జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు, ఇతర అభ్యర్థనలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు తెలిపారు.
ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గోలి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవాలని, అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రసిడెంట్లు,మాజీ ఎంపీపీ లు, తాజా మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీ లు, తాజా మాజీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




