Veldanda: బాధిత కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శ, ఆర్థిక సాయం!
Veldanda: వెల్దండ మండలం రాఘయిపల్లిలో మృతురాలు లచ్చుమామ్మ కుటుంబాన్ని పరామర్శించి రూ.5,000 ఆర్థిక సాయం అందించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.
Veldanda: బాధిత కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శ, ఆర్థిక సాయం!
వెల్దండ: రాఘయిపల్లి గ్రామానికి చెందిన కోనేటి లచ్చుమామ్మ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయాన్ని అందజేసి, కుటుంబానికి తన వంతు అండగా నిలిచారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వెల్దండ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ ఎంపీపీ పుట్టరామ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,మాజీ ఎంపిటిసి నిరంజన్,ఉప సర్పంచ్ కొండల్ యాదవ్,వెంకటయ్య,మెండే శ్రీను,అంజి మాస్టర్,గణేష్,అశోక్, పాపా,గిరి,మలేష్, సుదర్శన్, సురేష్,నర్సింహా,తదితరులు పాల్గొన్నారు.




