Veligonda: ఈ నెల 27న వెలుగొండ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు

Veligonda: ఈ నెల 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసిద్ధ వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు.

Srikanth Singam, Markapur
Published on: 24 Jun 2026 11:58 AM IST
Veligonda
X

Veligonda: ఈ నెల 27న వెలుగొండ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు

Veligonda: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత, జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యటించారు. ఈ నెల 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో హెలిప్యాడ్‌తో పాటు భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అవసరమైన అన్ని చర్యలను అధికారులు సమీక్షించారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్, త్రిపురాంతకం సీఐ హసన్, పెద్ద దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య వెలుగొండ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story