Velugodu: వెలుగోడు అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
Velugodu: వెలుగోడులో 'వన్ మంత్.. ఫోర్ విజిట్స్' కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియా ఆగ్రహం.
Velugodu: వెలుగోడు అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
ఆత్మకూరు: ప్రజల యొక్క సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వాటిని 15 రోజుల్లో పరిశీలించి పరిష్కరించడం మన బాధ్యత అని అందుకే.. వన్ మంత్.. ఫోర్ విజిట్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రతి మండలంలో నిర్వహిస్తున్నామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియా ప్రజలకు వివరించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సునీల్ శరాన్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎన్ని సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకే ఏర్పాటుచేసిన ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రజలను కోరారు. ప్రజల నుంచి ఎక్కువగా భూ సమస్యలు వస్తున్నాయని వీటితోపాటు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టి నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలన్నారు. అర్జిదారుడి సమస్యను పరిష్కరించినప్పుడే మన వృత్తికి న్యాయం చేసినట్లు భావించాలని, చాలామంది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని.. మరి పనితీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అర్జీదారుడి ఫిర్యాదును స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారిపై మండిపడ్డారు. ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యను పరిశీలించి పరిశీలించకపోవడం వల్లనే .. జిల్లా కేంద్రం సమస్యల పరిష్కార వేదికకు వస్తున్నారని.. సాయంత్రం లోగా సమస్యను పరిష్కరించి ఆయుర్వేదికలను తనకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఇప్పటివరకు శ్రీశైలం నియోజకవర్గం లో ఆత్మకూరు, మహానంది మండలాల్లో ఈ కార్యక్రమం పూర్తయిందని, వెలుగోడు మండలంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే జిల్లా అధికారులను ఇక్కడికి రప్పించామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచన విధానమే ఈ వన్ మంత్.. ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తెలిపారు.




