Nandikotkur: మధ్యాహ్నం కాకముందే విలేజ్ హెల్త్ క్లినిక్‌కు తాళం!

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో మధ్యాహ్నం కాకముందే విలేజ్ హెల్త్ క్లినిక్‌కు తాళం వేయడంతో వైద్యం కోసం వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 9 Oct 2026 1:42 PM IST
Nandikotkur
X

Nandikotkur: మధ్యాహ్నం కాకముందే విలేజ్ హెల్త్ క్లినిక్‌కు తాళం!

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్‌కు శుక్రవారం మధ్యాహ్నం కాకముందే తాళం వేసి ఉండటంతో వైద్యం కోసం వచ్చిన గ్రామ ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి కేంద్రానికి వస్తే, తాళం వేసి ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ప్రభుత్వం, ప్రజలకు గ్రామస్థాయిలోనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో లక్షల రూపాయలు వెచ్చించి విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం కాకముందే క్లినిక్‌కు తాళం వేసి ఉండటంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య కేంద్రం ఇలా మూసివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు సకాలంలో వైద్యం అందించాల్సిన కేంద్రాలు నిర్ణీత సమయాల్లో పనిచేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. దామగట్ల విలేజ్ హెల్త్ క్లినిక్‌లో సిబ్బంది అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను అధికారులు పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)