Pattikonda: పత్తికొండ ఆర్ఆర్ స్కూల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Pattikonda: కర్నూలు జిల్లా పత్తికొండ ఆర్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.. మట్టి గణపతులను పూజించాలని కరస్పాండెంట్ పిలుపునిచ్చారు.

G Jagadeesh, Pathikonda
Published on: 11 Sept 2026 9:28 PM IST
Pattikonda
X

Pattikonda: పత్తికొండ ఆర్ఆర్ స్కూల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

కర్నూలు జిల్లా: పత్తికొండ పట్టణంలోని స్థానిక ఆర్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించడం మన సంప్రదాయమని అన్నారు. విద్యార్థులు చదువులో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు ఏకాగ్రత, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం వంటి మంచి గుణాలను వినాయకుడి నుంచి నేర్చుకోవాలని సూచించారు.

మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. విద్యార్థులతో కలిసి వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్ మనోహర్, ఇన్‌చార్జి రాజేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda