Kurnool: కర్నూలులో రాత్రివేళ విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం.. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
Kurnool: కర్నూలు జిల్లాలో పోలీసుల విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో రాత్రివేళల్లో ప్రత్యేక తనిఖీలు. కొండారెడ్డి బురుజు నుంచి బస్టాండ్ వరకు సీఐ తేజమూర్తి పర్యవేక్షణలో తనిఖీలు.
Kurnool: కర్నూలులో రాత్రివేళ విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం.. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
కర్నూలు: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కర్నూలు పోలీసులు రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్‌ను కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నారు.
ఈ చర్యలలో భాగంగా నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, అనుమానాస్పద వాహనాల పరిశీలనలు చేపడుతున్నారు. బుధవారం రాత్రి కర్నూలు తాలూకా సీఐ తేజ మూర్తి ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు, అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 14 బ్లూ కోల్ట్స్ బృందాలు, 4 క్యూఆర్టీ (QRT) బృందాలు పాల్గొని కట్టుదిట్టంగా పర్యవేక్షణ కొనసాగించాయి. రాత్రి 11 గంటల తర్వాత షాపులను మూసివేయిస్తూ, అనవసరంగా బయట తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112/100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.




