Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

Kurnool: జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గిన్నిస్ రికార్డ్ హోల్డర్, ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 July 2026 3:50 PM IST
Kurnool
X

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం అందించిన పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఈ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ (గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్) గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో ఉపయోగకరమని, పుస్తకాలను ప్రతిరోజు చదువులో భాగంగా చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మల్లికార్జున, విజయ శేఖర్, రామకృష్ణ, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను స్వీకరించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story