Banaganapalle: బనగానపల్లెలో వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ!
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ రెండు నుంచి నాలుగో తేదీ వరకు నిర్వహించనున్న ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Banaganapalle: బనగానపల్లెలో వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ!
Banaganapalle: దసరా పండుగ సందర్భంగా బనగానపల్లెలో అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్న వాలీబాల్ ఓపెన్ టోర్నమెంట్ పోస్టర్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బీసీ ఇందిరారెడ్డి ఆవిష్కరించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
టోర్నమెంట్ విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ బహుమతిగా రూ.20 వేలు, నాలుగో బహుమతిగా రూ.10 వేలు అందజేయనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులకు భోజన సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.




