Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ఓటరు అవగాహన సదస్సు!
Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు.
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ఓటరు అవగాహన సదస్సు!
Kurnool: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ఓటరు నమోదు మరియు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ్, VRO ప్రశాంత్ పాల్గొని విద్యార్థులకు ఓటరు నమోదు ప్రక్రియ, ఓటు హక్కు ప్రాధాన్యత, ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి, విద్యార్థిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన విలువైన ప్రజాస్వామ్య హక్కు అని, అర్హత కలిగిన యువత తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకుని భవిష్యత్తులో తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని తెలిపారు.
అలాగే ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవడం, వివరాల్లో మార్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడం వంటి అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత ఓటరు నమోదు చేసుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల్లోని అర్హత కలిగిన వారిని కూడా ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించడం ద్వారా మంచి పౌర సమాజ నిర్మాణానికి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డాక్టర్ ఎస్. నాగ స్వామి నాయక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విజయ శేఖర్, రామకృష్ణ, సోమేష్, ఉల్గోజి రావు, శారధి పటేల్, ఎంటియాజ్, శ్రీధర్ మూర్తి, బాలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




