Devanakonda: పాత పద్ధతిలోనే ఉపాధి పనులు కల్పించాలి.. వీరశేఖర్ డిమాండ్

Devanakonda: ఫేస్ యాప్ రద్దు చేయాలని దేవనకొండలో వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా. పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పనులు కల్పించాలని జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్ డిమాండ్.

G Jagadeesh, Pathikonda
Published on: 1 July 2026 4:47 PM IST
Devanakonda
X

Devanakonda: పాత పద్ధతిలోనే ఉపాధి పనులు కల్పించాలి.. వీరశేఖర్ డిమాండ్

దేవనకొండ: గ్రామీణ ప్రాంత పేదలకు ఆర్థికంగా భరోసాగా ఉంటున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉరివేసి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చట్టాన్ని పేరు మార్పే కాకుండా నిబంధనల పేరుతో ఉపాధికి తూట్లు పడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ పేర్కొన్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత కమిటీ పిలుపుమేరకు విబిజీ గ్రాంజీని రద్దు చేయాలని పాత పద్ధతిలోనే పని కల్పించాలని పని ప్రదేశాల్లో మౌలిక వసతులు వేతనం పెంపు తదితర సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘానికి పిలుపుమేరకు దేవనకొండ మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షులు మహబూబ్ బాషా అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ

ఉపాధి హామీ కూలీలను పేస్ యాప్ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫేస్ యాప్ ను రద్దు చేయాలని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలినీ చేసిన పనికి పే స్లిప్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను వివిధ రకాల మార్పులతో, పని దినాలు పెంచుతున్నామని సాకుతో విబిజీ గ్రామ్ జి గా పేరు మార్చి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది ఇప్పటికే నిధులు తగ్గించిన నేపథ్యంలో కూలీలకు అన్యాయం జరుగుతుంది ఈ నేపథ్యంలో మరిన్ని నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా పేరుతో గ్రామీణ ఉపాధి హామీని గొంతు కోసే ప్రయత్నం జరుగుతుంది.

కావున పాత పద్ధతుల్లోని ఉపాధి పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు, వేసవిలో వ్యవసాయ పనులు లేని సమయంలో ప్రతి కుటుంబానికి పని కల్పించి, వలసలు అరికట్టేందుకు తెచ్చిన చట్టం. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉపాధి హామీ చట్టం లో అనేక రకాల మార్పులు తెచ్చింది, రెండు పూటల పనులు, రెండుపూటల పేస్ యాప్ ఎందుకోసం ?

కొలతల ప్రకారం పనులు చేస్తున్నారు ఎంత కొలతల కు అంత వేతనం వస్తుంది మరి ఎందుకు పేస్ యాప్. కనుక వెంటనే పేస్ యాప్ ఎత్తివేయాలనీ ఉదయం పూట మాత్రమే పనులు కల్పించాలనీ, అడిగిన వారందరికీ పనులు కల్పించాలినీ, పనిచేసిన వారంలోగా వేతనాలు ఇవ్వాలని, పనిప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలినీ ఆయన డిమాండ్ చేశారు

అదేవిధంగా చేసిన పని కి సంబంధించి పేస్లిప్లు ఇవ్వాలని ఉపాధిలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని ఉపాధి నిర్వహణకు సంబంధించి స్థానిక సంస్థలకే అధికారాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు యూసుఫ్ భాష సిఐటియు నాయకులు సుధాకర్ డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు మహేంద్ర, ఉపాధి కూలీలు లక్ష్మీదేవి సుభద్రమ్మ సుజాత రాజేశ్వరి అదే విధంగా రామకృష్ణ మల్లికార్జున వెంకటేశ్వర్లు ఆంజనేయులు పాల్గొన్నారు మండలంలోని కుంకనూరు, పాలకుర్తి ,తెర్నేకల్ గ్రామ సచివాలయల ముందు కూడా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ఆయా సచివాలయ బాధ్యులకు వినతిపత్రం అందజేశారు..

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story