Ternekal: తెర్నేకల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: డాక్టర్ సాధిక
Ternekal: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్, పుల్లాపురంలో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక కూటమి నేతలతో కలిసి విస్తృత ప్రచారం చేశారు.
Ternekal: తెర్నేకల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: డాక్టర్ సాధిక
Ternekal: తెర్నేకల్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం.. చెప్పాం.. చేస్తున్నాం : డాక్టర్ షేక్ సాధికస్వాతంత్ర్య పోరాట చరిత్ర కలిగిన తెర్నేకల్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాసైకిల్ గుర్తుపై ఓటు వేసి జెడ్పీటీసీగా గెలిపించండి.
కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను కూడా ఆశీర్వదించండిదేవనకొండ: తెర్నేకల్ గ్రామానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, బ్రిటిష్ పాలకులను ఎదిరించి స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన పౌరుషాల గడ్డగా ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలుగుదేశం పార్టీ దేవనకొండ జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక అన్నారు.
అలాంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామం ఉన్న మండలం నుంచి తాను జెడ్పీటీసీగా పోటీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే తెర్నేకల్ తో పాటు మండలంలోని అన్ని గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆదివారం ఆమె టీడీపీ మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్, జనసేన ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి తెర్నేకల్ వెంకప్ప, టీడీపీ సీనియర్ నాయకులు ఈదుల దేవరబండ సుభాన్తో కలిసి దేవనకొండ మండలంలోని తెర్నేకల్, పుల్లాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అవ్వా, తాతా, అమ్మా, అక్కా, అన్నా అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి జెడ్పీటీసీగా గెలిపించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
తనతో పాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న మొదటి, రెండో ఎంపీటీసీ అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు.అనంతరం డాక్టర్ సాధిక మాట్లాడుతూ తెర్నేకల్లు గ్రామానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని, స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి అక్క సహకారంతో మండలంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేలా మంచినీటి వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్, జనసేన ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి తెర్నేకల్ వెంకప్ప, టీడీపీ సీనియర్ నాయకులు ఈదుల దేవరబండ సుభాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.
జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధికతో పాటు కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం తమ మొదటి ప్రాధాన్యత అని నాయకులు పేర్కొన్నారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు, నాయకులు బండిగింజల రంగన్న, కప్పట్రాళ్ల మల్లికార్జున, నాగేష్, తిమప్ప, బీజేపీ నాయకులు కిరణ్, వీరయ్య స్వామి, వెంకట్రాముడు, సుభాన్, మస్తాన్, ఐటీడీపీ రామాంజి, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




