Nandyal: ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష!

Nandyal: నంద్యాల జిల్లా ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 6 Aug 2026 4:21 PM IST
Nandyal
X

Nandyal: ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్ష!

Nandyal: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గడచిన రెండున్నర సంవత్సరాల్లో అరాచక పాలన సాగిస్తూ నిరుద్యోగ యువత భవిష్యత్తుపై దెబ్బ కొట్టిందని వైఎస్ఆర్సిపి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ధ్వజమెత్తారు. ఆ పార్టీ పిలుపుమేరకు నంద్యాల జిల్లా ఆత్మకూరులో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే శిల్పా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

నాలుగు ప్రధాన డిమాండ్లను నెరవేర్చకపోతే జెన్- జీ తరహా ఉద్యమాన్ని అమరావతిలో చేపట్టి కూటమి ప్రభుత్వం మెడలు వంచుతామని శిల్పా ఘాటుగా హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

నిరుద్యోగుల డీఎస్సీ ని ధగా డీఎస్సీగా మార్చి ఉద్యోగాలను లక్షల రూపాయలకు అమ్ముకుని విద్యావంతులైన నిరుద్యోగులను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని శిల్పతోపాటు నిరసనకారులు డిమాండ్ చేశారు.

చంద్రబాబు నాయుడు ఒక్క కొత్తపథకాన్నికూడా తీసుకురాకుండా .. అమరావతి రాజధానిని అడ్డుపెట్టుకుని భూదోపిడికి పాల్పడుతుంటే .. ఇక చూస్తూ ఊరుకోమని త్వరలో ఢిల్లీ జంతర్ మంతర్ తరహా ఉద్యమాన్ని అమరావతిలో చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే శిల్పా ఘాటుగా హెచ్చరించారు.

ప్రధానంగా నాలుగు డిమాండ్లలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ చే దర్యాప్తు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, విద్యావంతులైన నిరుద్యోగులకు రూ. 3000 జీవన భృతి అమలు చేయాలని కోరారు. ఒంటరిగా పోటీచేసే దమ్ము లేకనే మూడుముక్కలాట కూటమి కుంపటిలోదూరి గద్దెనెక్కిన మోసకారి చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో భరతం పట్టేందుకు వైస్సార్సీపీ శ్రేణులు సిదంగా ఉన్నాయన్నారు.

ఇంతటి దఘా ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూసివుండరని ఆయన ఎద్దేవా చేసారు. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ రిలే నిరాహార దీక్షల్లో ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, శ్రీశైలం మండలాల నిరుద్యోగులు, యువకులు, పార్టీ శ్రేణులు హాజరుకానున్నాయి.

శ్రీశైలం నియోజకవర్గం పాలనా కేంద్రం ఆత్మకూరులో జరిగిన మొదటి రోజు రిలే నిరాహార దీక్షలో యువత, విద్యావంతులు, నిరుద్యోగులు, ఆ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story